ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay With YS Jagan at Chennai Wedding

జన నాయగన్‌ తో జగన్

Vijay With YS Jagan at Chennai Wedding

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చెన్నై లో హడావిడి చేస్తున్నారు. చెన్నైలో జరిగిన జగన్‌ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో జగన్ ఆయన భార్య భారతి ఇంకా జగన్ బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇదే వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ తో పాటుగా మంచు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. 

అయితే అదే వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కూడా పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, విజయ్‌ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. జగన్ కాసేపు కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌ తో ముచ్చటించిన ఫొటోస్, వీడియోస్ చూసినవారు జన నాయగన్‌ తో జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ వేడుకలో జగన్ తో సూర్య, కార్తీ హగ్ ఇచ్చిన ఫొటోస్, అలాగే మోహన్ బాబు తో జగన్ మాట కలిపిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

Jagan blesses newlyweds at family wedding in Chennai

jagan