ఎంత చేసినా సింగిల్ డిజిట్ దాటలే

Chandrahas Barabar PremisthaChandrahas Barabar Premistha

హీరోగా క్రేజ్ సంపాదించాలి, నటుడిగా ప్రేక్షకులకు చేరువవ్వాలి అంటే మంచి కంటెంట్ ని నమ్ముకోవడమో, లేదంటే మంచి దర్శకులను ఎంచుకోవడమో మానేసి.. వైరల్ అయితే ప్రేక్షకులకు వచ్చేస్తారు, సినిమాలు ఆడేస్తాయనే భ్రమలో చాలామంది కుర్ర హీరోలు, ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యేవాళ్ళు ఆలోచిస్తున్నారు.

ఈటివి ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ మొదటి సినిమాకే యాటిట్యూడ్ చూపించి ప్రేక్షకులతో యాటిట్యూడ్ స్టార్ అనిపించుకున్నాడు. రెండో సినిమాకి మరింతగా దిగజారి తను నటించిన బారాబర్ ప్రేమిస్తా ఈవెంట్ లో బూతు పదాలతో పాట పాడి నలుగురిలో వైరల్ అవుదామని నవ్వులపాలయ్యాడు. ఏది ఏమైనా గత నాలుగు రోజులుగా చంద్రహాస్ మీడియాలో హల్ చల్ చేసాడు.

ఎంత చేసినా చంద్రహాస్ నటించిన సినిమాకి ఓపెనింగ్స్ లేవు, బుక్ మై షో ఓపెన్ చేస్తే బుకింగ్స్ లో సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. ఏది చేసినా, ఎంత చేసినా విభిన్నమైన ప్రమోషన్స్, అద్భుతమైన కంటెంట్ ఉంటేనే తప్ప ప్రేక్షకులు ఆదరించడం లేదు, పెద్ద పెద్ద హీరోలకే దిక్కు లేదు, చంద్రహాస్ ఓ లెక్కా..!. 

Actor Chandrahas

chandrahas