చిరు కూతురుగా ధురంధర్ పాప

Sara Arjun in Talks for Mega 158

మెగాస్టార్ చిరంజీవి కి ఈ ఏడాది డబుల్ బొనాంజా. 2026 జనవరిలో మన శంకర వరప్రసాద్ సక్సెస్ తో చిరు కెరీర్ ఫుల్ స్వింగ్ లోకి వెళ్లగా.. ఇదే ఏడాది అదే జనవరిలో తన ఇంటికి వారసుడు, వారసురాలు ఒకేరోజు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసనలు మెగాస్టార్ కి ట్విన్స్ రూపంలో మనవడు-మనవరాలిని అందించారు. 

ఇక అదే జోష్ లో దర్శకుడు బాబీ తో మెగాస్టార్ చిరంజీవి మెగా 158 స్టార్ట్ చెయ్యబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న బాబీ ఈ చిత్రాన్ని మార్చ్ నుంచి పట్టాలెక్కించేందుకు సిద్దముతున్నాడు. ఈ చిత్రంలో చిరు ప్రియమణి తో జోడి కట్టబోతున్నారు. అయితే ఈ కథలో చిరు కి ఆయన కూతురు కు మద్యన చాలా ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయట.

మెగా 158 లో ఏంతో కీలకమైన కూతురు పాత్ర కోసం కృతి శెట్టి పేరు వినిపించింది. కానీ అది రూమర్ అంటూ మెగా 158 టీమ్ కొట్టిపారేసింది. అయితే ధురంధర్ చిత్రంలో 20 ఏళ్ళ మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా రణ్వీర్ సింగ్ తో రొమాన్స్ చేసిన సారా అర్జున్ ని చిరు కుమార్తె పాత్ర కోసం కన్సిడర్ చేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది. చూద్దాం చిరు కూతురు పాత్రలో ఎవరు మెరుస్తారో అనేది.

Dhurandhar Fame Sara Arjun in Talks for Mega 158

dhurandhar