కన్ఫ్యూజన్ లో అఖిల్ లెనిన్ రిలీజ్

Akhil Lenin Release in ConfusionAkhil Lenin Release in Confusion

మే 1 కి అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ఫస్ట్ సింగిల్ అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. అసలే ప్లాప్ లో ఉన్న హీరో ఈసారి ఆచి తూచి కంటెంట్ మాట్లాడాలి అంటూ సైలెంట్ గా లెనిన్ షూటింగ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తెచ్చెందుకు రెడీ చేస్తున్న అఖిల్ ఇప్పుడు తన సినిమా విడుదల విషయంలో కన్ఫ్యూజన్ పడ్డాడు.

కారణం ఏప్రిల్ 30 న రామ్ చరణ్ పెద్ది విడుదల అంటూ మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ఇప్పుడు అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ సమస్యల్లో పడింది. పెద్ది రావడం లెనిన్ కి ఇబ్బంది అవుతుంది. సో లెనిన్ డేట్ మార్చుకోవాల్సిందే. 

మరి లెనిన్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అసలే మూడేళ్లకు పైగా అవుతుంది అఖిల్ ని బిగ్ స్క్రీన్ పై చూసుకుని, అందుకే అక్కినేని అభిమానులు అఖిల్ లెనిన్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి లెనిన్ ఎప్పుడు దిగుతాడా, కొత్త డేట్ పై లెనిన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి. 

Akhil Lenin

akhil