ఈవెంట్ ఏదైనా చొక్కా విప్పడం ప‌క్కా

Superstar Mahesh Babu

`వార‌ణాసి` తొలి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని లైవ్ లోనే స్టైలిష్ లుక్ లో అల‌రించాడు. అందుకు కార‌కుడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. సాధార‌ణ చొక్కా..ప్యాంట్ వేసుకుని వ‌స్తాన‌ని మ‌హేష్ అంటే? అబ్బే అలా కుద‌ర‌దు తాను చెప్పిన‌ట్లు ముస్తాబై రావాల్సిందేన‌ని జ‌క్క‌న్న ఆదేశించ‌డంతో మ‌హేష్ కు త‌ప్ప‌లేదు. స్టైలిష్ ప్యాంట్ టీష‌ర్ట్ లో అల‌రించాడు.

అదే స‌మ‌యంలో ఇప్ప‌టికి ఒంటిపై ఇవ‌నై ఉన్నాయి?  త‌ర్వాత చొక్కా కూడా విప్పాల్సి ఉంటుందేమోన‌ని మ‌హేష్ సందేహం వ్య‌క్తం చేసాడు. ఆయ‌న మాట ఫ‌లించేలా ఉంది. భ‌విష్య‌త్ లో జ‌రిగే ఈవెంట్ల‌లో మ‌హేష్ సిక్స్ ప్యాక్ లుక్ లైవ్ లోనే ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల్లో చర్చ‌కొస్తుంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుందా?   టీజ‌ర్, ట్రైల‌ర్ ఈవెంట్ అవుతుందా?  చెప్ప‌లేమంటూ గుస గుస‌లాడుకుంటున్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ అయితే వేలాది అభిమానుల స‌మ‌క్షంలో జ‌రుగుతుంది. అలాంటి చోట చొక్కా విప్పితే  వెరే లెవ‌ల్లో ఉంటుంది. మిగ‌తా రెండు ఈవెంట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాక‌పోతే జ‌న స‌మీక‌ర‌ణ త‌క్కువ‌గా అవ‌కాశం ఉంటుంది. మ‌రి వీటిలో రాజ‌మౌళి ఏ ఈవెంట్ లో ప్లాన్ చేస్తాడు?  అన్న‌ది అత‌డి నిర్ణ‌యంపై ఉంటుంది. ఈ చిత్రా న్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ స‌మీపంలో మరే సినిమా రిలీజ్ లేకుండా ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. 

Mahesh Babu - Varanasi

mahesh babu