సస్పెన్స్ కి తెర దించిన పెద్ది
Peddi Releasing On April 30గత ఏడాది రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ లుక్ వదిలినప్పుడే పెద్ది చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా 2026 మార్చ్ 27న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మధ్యలో ఎన్నిసార్లు పెద్ది రిలీజ్ డేట్ పై పుకార్లు వ్యాప్తి చెందినా మేకర్స్ మార్చ్ 27 కె స్టిక్ అయ్యి ఉన్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా మార్చ్ 27 నే పెద్ది రిలీజ్ అని చెప్పారు.
కానీ బాలీవుడ్ ధురంధర్ దెబ్బకి మార్చ్ 27 నుంచి పెద్ది పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రచారం జరగడం, పెద్ది కొత్త రిలీజ్ డేట్ పై రకరకాల ఊహగానాలు వినిపించడంతో పెద్ది రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా పెద్ది దర్శకుడు బుచ్చి బాబు ఈ సస్పెన్స్ కి తెర దించుతూ పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు.
అది కూడా పవర్ ఫుల్ పోస్టర్ తో పెద్ది డేట్ అనౌన్సమెంట్ ఇచ్చారు. రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు ఆ రిలీజ్ డేట్ పోస్టర్ లో. మరి మార్చ్ 27 నుంచి జస్ట్ ఒక్క నెల గ్యాప్ లోనే పెద్ది ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Peddi Releasing Worldwide In Theatres On April 30







































