ప్రీ వెడ్డింగ్ పార్టీ దుబాయ్ లో - మరి పెళ్లి
Allu Sirish Grand Pre-Wedding Shoot in Dubaiఅల్లు వారి ఇంట్లో పెళ్లి అంటే ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇప్పుడు అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ పెళ్లి మార్చి 16 న జరగబోతుంది. పెళ్ళికి ముందే అంటే దాదాపు నెలన్నర ముందే అల్లు వారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకుంది.
దుబాయ్ లో ఓ షిప్ లో అల్లు శిరీష్-నయనికా ల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏ రేంజ్ లో జరిగిందో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. అల్లు ఫ్యామిలీ మొత్తం అంటే అల్లు బాబీ ఆయన వైఫ్, అల్లు అర్జున్ ఆయన వైఫ్ ఇలా అందరూ ఈ పార్టీలో ఎంతగా ఎంజాయ్ చేసారో చూసాము.
అల్లు శిరీష్-నయనిక ల ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ.. అబ్బో అల్లు వారి పెళ్లి సందడి వేరే లెవల్లో లో స్టార్ట్ అయ్యింది. మరి ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం దుబాయ్ వెళ్లిన అల్లు ఫ్యామిలీ.. అల్లు శిరీష్ పెళ్లి ని ఎక్కడ ప్లాన్ చేసిందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ఉదయ పూర్ ప్యాలెస్, లేదంటే గోవా.. కాదు ఇంకా ఎక్కడైనా డెస్టినేషన్ వెడ్డింగ్ గా అల్లు శిరీష్ పెళ్లి ఉండబోతుందా అనే విషయంలో అల్లు ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు.
మరి అల్లు శిరీష్-నయనికా ల పెళ్లి ఎక్కడ జరగబోతుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
Allu Sirish has started his wedding celebrations in a joyful way in Dubai






































