ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dhurandhar 2 is making everyone excited

అందరినీ హడలెత్తిస్తున్న ధురంధర్ 2

Dhurandhar 2 is making everyone excitedDhurandhar 2 is making everyone excited

నిజమే రణ్వీర్ సింగ్-ఆదిత్య ధర్ ల ధురంధర్ చిత్రం ప్రతి భాష హీరోలని హడలెత్తిస్తోంది. డిసెంబర్ 5 న అంచనాలు లేకుండా విడుదలై రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో రూ.1000 కోట్లు పైగా కొల్లగొట్టి సంచలనాలు సృష్టించడమే కాదు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ నెంబర్ 1 ప్లేస్ లో కూర్చుంది. నార్త్ లోనే కాదు పాన్ ఇండియా భాషల ప్రేక్షకులు ధురంధర్ చూసి తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు.

దెబ్బకి ధురంధర్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ధురంధర్ పార్ట్ 2 పై ఉన్న క్రేజ్ చూసి మార్చ్ 27 న రావాల్సిన రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ కామ్ గా సమ్మర్ కి వెళ్లిపోయాయి. అదే మార్చ్ 19 అంటే ధురంధర్ 2 విడుదల సమయంలో రావాల్సిన అడివి శేష్ డెకాయిట్ ఏప్రిల్ 10 కి షిఫ్ట్ అయ్యింది. 

మరోపక్క పదే పదే మార్చ్ 19 రిలీజ్ అంటూ బల్లగుద్ది చెప్పిన పాన్ ఇండియా స్టార్ యష్ లేటెస్ట్ చిత్రం టాక్సిక్ కూడా మార్చ్ 19 నుంచి పోస్ట్ పోన్ చేస్తారనే వార్త చూసి ధురంధర్ దెబ్బకు అందరూ హడల్, ఒక్కో సినిమాకి ఒక్కో టైమ్, అది ఇప్పుడు ధురంధర్ కి వచ్చింది. ప్రస్తుతం ధురంధర్ ధాటికి కొట్టుకుపోవడం ఇష్టం లేని సినిమాలన్ని సైలెంట్ గా తప్పుకుంటున్నాయి. 

Dhurandhar 2 is set to release in cinemas on March 19

dhurandhar 2