TP-మోహన్ బాబుకి దిమ్మతిరిగే పారితోషికం
Mohan Babu Record Remuneration for The Paradiseనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎప్పుడో కానీ స్క్రీన్ పై కనిపించని మోహన్ బాబు ప్యారడైజ్ లో పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తారనేది ఆయన ఫస్ట్ లుక్ తోనే శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చేసాడు.
నాని ని ఢీ కొట్టే విలన్ గా మోహన్ బాబు ఈచిత్రం కోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నారట. ది ప్యారడైజ్ కోసం మోహన్ బాబు 7 నుంచి 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని, ఆయన సోలో గా చేసినా రాని పారితోషికం ప్యారడైజ్ కి మోహన్ బాబు తీసుకోబోతున్నారని అంటున్నారు.
ఇక ప్యారడైజ్ చిత్రాన్ని మార్చ్ 26 న విడుదల చెయ్యాలని ముందు అనుకున్నా ఇప్పుడు పెద్ది కోసం ప్యారడైజ్ వెనక్కి తగ్గినా.. పెద్ది కూడా ఆల్మోస్ట్ మార్చి 27 నుంచి తప్పుకోబోతుంది. మరి ప్యారడైజ్ సమ్మర్ కానీ లేదంటే జూన్ లో కానీ విడుదల ఉండొచ్చని తెలుస్తుంది.
Mohan Babu role in The Paradise







































