2027 - స్పిరిట్ vs వారణాసి

Spirit vs VaranasiSpirit vs Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7 న విడుదల చేస్తున్నట్టుగా రాజమౌళి వారణాసి వేదికగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. విపరీతమైన క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న వారణాసి తో ఇప్పుడు ప్రభాస్ పోటీ పడనున్నాడని తెలుస్తుంది.

కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న స్పిరిట్ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల చెయ్యాలని, హాలిడేస్ కూడా కలిసొస్తాయని సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నాడట. హాలిడే రోజున వారణాసి విడుదలైనా, వర్కింగ్ డే రోజున స్పిరిట్ ని రిలీజ్ చేస్తారని టాక్.

ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఏప్రిల్ లో అటు ఇటుగా ఒకేసారి స్పిరిట్, వారణాసి విడుదలైతే ఆ మజా మాములుగా  ఉండదు. మరి ఇది నిజమవుతుందా, సందీప్ రెడ్డి vs రాజమౌళి అంతకుమించి ప్రభాస్ vs మహేష్ బాబు.. అబ్బో వింటుంటూనే కిక్ వచ్చేస్తుంది. 

Prabhas Spirit vs Mahesh Babu Varanasi

spirit