ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akshaye Khanna will be missed in Dhurandhar 2

ధురంధర్ 2 లో అక్షయ్ ఖన్నాను మిస్ అవుతారు

Akshaye Khanna will be missed in Dhurandhar 2Akshaye Khanna will be missed in Dhurandhar 2

 

ధురంధర్ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేసిన అక్షయ్ ఖన్నా కు హీరో రణ్వీర్ సింగ్ కన్నా ఎక్కువ పేరొచ్చింది. హీరో రణ్వీర్ సింగ్ ఎలివేషన్స్ కన్నా అక్షయ ఖన్నా కు ధురంధర్ దర్శకుడు ఆదిత్య దార్ ఇచ్చిన ఎలివేషన్స్ కు కామన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అక్షయ్ ఖన్నా యాక్టింగ్ కి కూడా ఫిదా కాని ప్రేక్షకుడు లేరు. 

ధురంధర్ లో అక్షయ ఖన్నా కు పవర్ ఫుల్ పాత్ర పడింది. ధురంధర్ పార్ట్ 1 లో అక్షయ్ ఖన్నా పాత్ర చనిపోతుంది. ధురంధర్2 పై  భీభత్సమైన అంచనాలున్నాయి. మార్చ్ 19 కోసం అందరూ వెయిటింగ్. మార్చ్ 19 న విడుదల కాబోయే ధురంధర్ 2 కోసం పడి చచ్చిపోతున్నారు. థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను ధురంధర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

అయితే ధురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్న వారు.. అందులో ఖచ్చితంగా అక్షయ్ ఖన్నా ని ప్రేక్షకులు మిస్ అవడం ఖాయం. రణ్వీర్ సింగ్ కి ధురంధర్ 2లో ఎలివేషన్ ఉంటుంది. మరి ఈ పార్ట్ 2 లో రణ్వీర్ తో ఢీ కొట్టబోయే విలన్ ఎవరు, అసలు అంత క్రూరంగా రణ్వీర్ ఎందుకు మారాల్సి వచ్చింది. రణ్వీర్ సింగ్ కరాచీ ని ఏలేందుకు ఏం చేస్తాడు అనేది పార్ట్ 2లో చూపించబోతున్నారు. 

Dhurandhar 2

dhurandhar 2