ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A staggering budget for Varanasi movie promotions

వారణాసి ప్రమోషన్స్ కి దిమ్మదిరిగే బడ్జెట్

A staggering budget for Varanasi movie promotionsA staggering budget for Varanasi movie promotions

సూపర్ స్టార్ మహేష్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో #GlobeTrotter ఈవెంట్ తోనే శాంపిల్ చూపించారు. రామోజీ ఫిలిం సిటీలో అంత భారీగా ఒక్క ఈవెంట్ కోసం ఖర్చు చేసిన రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ని సింపుల్ గా చెప్పి బిగ్ ప్రమోషన్స్ చేసారు. వారణాసి వీధుల్లో హోర్డింగ్స్ తో వారణాసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంటర్నేషనల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసారు.

అయితే వారణాసి కి ఎంత బడ్జెట్ పెడుతున్నారో, ఏవేవో అంకెలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్ కోసమే రాజమౌళి ఓ బడ్జెట్ ని కేటాయించారట. అది కూడా అలాంటి ఇలాంటి బడ్జెట్ కాదండోయ్.. ఏకంగా రాజమౌళి వారణాసి ప్రమోషన్స్ కోసం 75 కోట్ల బడ్జెట్ కేటాయించారనే వార్త ఒక్కసారిగా వైరల్ అవుతుంది. 

అంటే హాలీవుడ్ రేంజ్ లో వారణాసి ని ప్రమోట్ చెయ్యాలిగా అందుకే రాజమౌళి ఇందమాదిరి బడ్జెట్ ని ప్రమోషన్స్ కోసం కేటాయించి ఉంటారని మహేష్ ఫ్యాన్స్ సర్దుకున్నా.. మిగతా వారు మాత్రం ఆ బడ్జెట్ విని నోరెళ్ల బెడుతున్నారు. 

Varanasi movie update

varanasi