ఒకే నెల రెండు సినిమాలతో భాగ్యశ్రీ బోర్సే
Back to back films From Bhagyashri Borseఈ ఏడాది రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఇలా కొద్దిమంది హీరోయిన్స్ కి మాత్రమే అరుదుగా జరిగే అదృష్టం. ఒకప్పుడు పూజ హెగ్డే ఇలానే క్రేజీగా కనిపించింది. ఆతర్వాత శ్రీలీల టైమ్ నడిచింది. ఆ నెక్స్ట్ మీనాక్షి చౌదరి ఇంత బిజీగా కనిపించింది. ఇప్పుడు ఆ అదృష్టం భాగ్యశ్రీ బోర్సే కి దక్కింది.
మిస్టర్ బచ్చన్ డిజాస్టర్, కింగ్ డమ్ ఫెయిల్. అయినా ఈభామకు ఫుల్ డిమాండ్. ఈ ఏడాది అది కూడా ఒకే నెలలో భాగ్యశ్రీ బోర్సే రెండు సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది. అందులో ఒకటి కాంత. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే క్యూట్ గా వింటేజ్ లుక్ లో కనిపిస్తుంది.
ఇదే నెలలో హీరో రామ్ తో కలిసి నటించిన ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రం విడుదలవుతుంది. నవంబర్ 28 న ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో నవంబర్ అదృష్టం పరిక్షించుకోబోతున్న భాగ్యశ్రీ బోర్సే కి సక్సెస్ దక్కాలని కోరుకుందాం.
Bhagyashri Borse Turns busy with back to back films







































