సంక్రాంతి డేట్స్ పంచుకున్న ప్రభాస్ - చిరు

ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రావడానికి గట్టిగా ఫిక్స్ అయ్యాయి. అందులో ముందుగా ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ తేదీని నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించేసారు. పలుమార్లు వాయిదా పడిన రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి రిలీజ్ అనడమే కాదు దానికి డేట్ కూడా లాక్ చేసారు. జనవరి 9 న అంటూ రాజా సాబ్ డేట్ అనౌన్స్ చేసారు.
ఇక అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ ఓపెనింగ్ డే నుంచే చెబుతూ వచ్చారు. కానీ ఏ డేట్ కి వస్తుంది అని మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు చిరు కూడా జనవరిలో సంక్రాంతి పండుగ సీజన్ లో తేదీపై కచ్చిఫ్ వేశారు. అది జనవరి 14 న సంక్రాంతి ఫెస్టివల్ రోజున మన శంకర వర ప్రసాద్ గారు రాబోతున్నారు. త్వరలోనే ఈ డేట్ పై క్లారిటీ రానుంది.
సంక్రాంతి సీజన్ కి అఖండ 2 కూడా రావొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి అఖండ 2 ఏ తేదీ ని సెలక్ట్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఫైనల్ సంక్రాంతి సీజన్ లో ఇంకెన్ని సినిమాలు బరిలో దిగుతాయో అనేది కాస్త వెయిట్ చేస్తే తెలుస్తుంది.
Mana Shankara Varaprasad Garu movie is all set to release in theaters for Sankranthi 2026
Prabhas The Raja Saab to release for Sankranti






































