Advertisement

చేసిన తప్పుని కప్పి పుచ్చే ధైర్యం జగన్ కి లేదంట

గత ఏడాది బెట్టింగ్ కారణంగా మృతిచెందిన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు  పర్మిషన్ లేకపోయినా.. 50 వాహనాల్లో ర్యాలిగా జనసమూహాన్ని పోగేసుకుని హడావిడి చేసారు. ఈ  జనావాహంలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త అక్కడికి చేరుకొని జగన్ కి అభివాదం చేయబోయారు. 

అదే సమయంలో అనుకోకుండా సింగయ్య జగన్ కారు కింద పడిపోగా.. సింగయ్యను చూసుకోకుండా జగన్ వాహనం పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో సంచలంగా మారడమే కాదు.. సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ ని A2గా పెట్టి పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. ఈ విషయం మీడియాలో సెన్సేషన్ అయ్యింది. జగన్ కారణంగా ఓ వృద్ధుడు చనిపోవడం చర్చనీయంశమే అయ్యింది. అదే మీడియాలో హైలెట్ అయ్యింది. 

చేసింది తప్పు కానీ దాన్ని కప్పి పుచ్చుకునే ధైర్యం జగన్ కు లేదట. వైసీపీ వాళ్లకు అస్సలు లేదట. నీతి, నిజాయితీ అంటూ జగన్,వైసీపీ వాళ్ళు ఉండబట్టే ఎల్లో మీడియా ని ఎదురించే ధైర్యం వాళ్ళు చెయ్యడం లేదట. ఇది మరీ విచిత్రంగా లేదు జగన్ చేసింది తప్పు, దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉన్నారని బ్లూ మీడియా బాధపడిపోతోంది.

Jagan Mohan Reddy

Jagan
jagan