Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will directors dare to do Pawan Kalyan Biopic

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌థ‌తో సినిమా

Will directors dare to do Pawan Kalyan Biopic

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేనానిగా ప్ర‌జా జీవితాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. నాయ‌కుడిగా ఆయ‌న అంత‌కంత‌కు ప‌రిణ‌తి చెందుతున్నార‌ని అభిమానులు కీర్తిస్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం త‌మిళ‌నాడు మ‌ధురైలోని మురుగ‌న్ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ స్పీచ్ తంబీల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచే వారంద‌రికీ ఆయ‌న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఇదిలా ఉంటే, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడారు. తాను న‌టించిన సినిమాల్లో ఏ పాత్ర బాగా నచ్చింది? అని ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న నుంచి ఊహించ‌ని స‌మాధానం వ‌చ్చింది. తాను చేసిన పాత్ర‌ల్లో ఏవో కొన్ని ల‌క్ష‌ణాలు మాత్ర‌మే త‌న‌కు న‌చ్చాయ‌ని, పూర్తిగా త‌న‌కు క‌నెక్ట్ కాలేద‌ని అన్నారు. అంతేకాదు తాను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాంటి పాత్ర‌లోనే త‌న‌కు న‌టించాల‌ని ఉంద‌ని కూడా అన్నారు. అయితే ఇది సినిమాల్లో సాధ్యం కాక‌పోవ‌చ్చు... ప్రేక్ష‌కులు ఆ సినిమాను ఆద‌రిస్తారో లేదో తెలియ‌ద‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

 

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఏ ఉద్దేశంతో వ్యాఖ్యానించినా కానీ, అలాంటి ఒక ప్ర‌య‌త్నం జ‌రిగితే అది బ‌యోపిక్ కేట‌గిరీకి చెందుతుంది. ప‌వ‌న్ జీవిత క‌థ‌తో సినిమా తీసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో ఎవ‌రైనా ఉత్సాహంగా ఉన్నారా? ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా? ఆయ‌న‌ కోరిక‌ను మ‌న్నించి లైఫ్ ఇన్సిడెంట్స్ తో స్క్రిప్టును రెడీ చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి. బ‌హుశా ప‌వ‌ర్‌స్టార్‌ని అమితంగా ఆరాధించే అభిమానుల్లోంచే ఎవ‌రైనా ఒక స్క్రిప్టును రాసి సినిమా తీస్తారేమో!!

Pawan wants to play his real life role on screen

pawan kalyan biopic