Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jagan Supports to Daggubati Suresh Babu

సురేష్ బాబు, పోసాని లకు జగన్ సానుభూతి

Jagan Supports to Daggubati Suresh Babu

ఈరోజు బుధవారం వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమళ్లేశ్వర రావు విగ్రహవిష్కరణ కోసం మంది మార్బలంతో బల ప్రదర్శన చెయ్యగా.. జగన్ కాన్వాయ్ గుద్దుకుని ఒక వృద్ధుడు చనిపోగా.. మరో యువకుడు సొమ్మసిల్లి ప్రాణాలు వదిలిన ఘటనలు జగన పర్యటనలో జరిగిపోయాయి. ఇక 2024 ఎన్నికల ఫలితాల తరువాత స్థానిక టీడీపీ, జనసేన నేతలు నాగమళ్లేశ్వర రావును వేధించారని అందుకే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని జగన్ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

అంతేకాదు కమ్మవారిని కూటమి ప్రభుత్వం వేధిస్తుంది, వారిని ఎదగకుండా తొక్కేస్తుంది అంటూ జగన్ మోహన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, పోలీసు అధికారులు కులం పేరు పెట్టి పార్టీల గురించి ప్రశ్నించి వేధిస్తున్నారని అన్న జగన్.. కమ్మ వారు తమ పార్టీలో ఉంటే చంద్రబాబు కి ఏమైనా అభ్యంతరమా అని ప్రశ్నించారు. 

అవినాష్ ని కేసులు పెట్టి వేధిస్తున్నారు, నిలబడిపోరాడుతున్నాడు, అలాగే కొడాలి నాని పై అన్యాయంగా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీని అన్యాయంగా శిక్షిస్తున్నారు, పోసాని నే కాదు, దగ్గుబాటి సురేష్ బాబు స్థలాలను వెనక్కి తీసుకునే హక్కు మీకెవరిచ్చారు. 

కమ్మ వారు చంద్రబాబుకు ఊడిగం చేయటానికే పుట్టారా, చంద్రబాబుకు వ్యతిరేకం గా ఎవరైనా మాట్లాడితే వెంటాడి వేధించి హింసించి జైల్లో పెడుతున్నారని ఆరోపించిన జగన్ అలా సురేష్ బాబు, పోసాని కృష్ణమురళిపై సానుభూతి చూపిస్తూ మాట్లాడడం మాత్రం వైరలయ్యింది. అది చూసిన వారు సురేష్ బాబుకి పోసానికి జగన్ సపోర్ట్ చూసారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Jagan Supports to Daggubati Suresh Babu and Posani

suresh babu