Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Divvala Madhuri Shocking Comments On Roja

రోజా గాలి తీసేసిన దివ్వెల మాధురి

Divvala Madhuri Shocking Comments On Roja

వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసాక దువ్వాడ శ్రీనివాస్ కు ఎలాంటి బాధ లేదు, ఆయన దివ్వెల మాధురితో కలిసి స్టేజ్ పై డాన్స్ లు చెయ్యడం, సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడం చేస్తున్నారు. దివ్వెల మాధురి తో కలిసి వస్త్ర వ్యాపారం మొదలు పెట్టడమే కాదు, మాధురి తో కలిసి దువ్వాడ పబ్లిక్ గానే ఉంగరాలు తొడుగుతూ టింగు రంగాడిలా రెచ్చిపోతున్నాడు. 

అయితే దివ్వెల మాధురి తో కలిసి దువ్వాడ రీల్స్ చేసిన విషయంగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ కి కోపమొచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేశారనే టాక్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో మాధురి, దువ్వాడకు సదరు యాంకర్ మీరు రీల్స్ చేసిన విషయం నచ్చకే మిమ్మల్ని పార్టీ నుంచి పంపించేసారట కదా అని ప్రశ్న వేశారు. దానికి దువ్వాడ కామ్ గా ఉన్నా.. దివ్వెల మాధురి మాత్రం తడుముకోకుండా ఫైర్ అయ్యింది. 

మరి వైసీపీ పార్టీలో ఉన్న రోజా డాన్సు లు చెయ్యడం లేదా, జబర్దస్త్ లో స్కిట్స్ చెయ్యడం లేదా, అలాగే షోస్ లో డాన్స్ ల్లో ఆడడం లేదా, అదే పార్టీలో ఉన్న రోజా స్టెప్స్ వేస్తే ఆహో, ఓహో అంటారా.. మరి రోజాకి ఒక న్యాయం.. మాకో న్యాయమా, ఇక డాన్స్ వేసే వాళ్ళందరిని సస్పెండ్ చెయ్యాలంటే ఆ పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు అంటూ దివ్వెల మాధురి పనిలో పని వైసీపీ నేత రోజా గాలి తీసేసింది. 

Divvela Madhuri Comments on Roja

divvela madhuri