ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vallabhaneni Vamsi discharged from Ayush hospital

ఆయుష్ నుంచి జైలుకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi discharged from Ayush hospital

వల్లభనేని వంశీని అనారోగ్య కారణాల చేత మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్చమంటూ ఏపీ హై కోర్టు విజయవాడ జైలు అధికారులకు ఆర్డర్ వేసింది. గత వారం వల్లభనేని వంశీ కి శ్వాస సంబంధిత సమస్య ఎక్కువవడంతో ఆయన్ని గుంటూరు GGH కి తరలించి పోలీసులు వైద్యం అందించారు. GGH వైద్యులు వంశీ కి మెరుగైన వైద్యం అవసరమని సూసించగా వంశీ తరపు లాయర్ హై కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. 

వంశీ కి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఏపీ హై కోర్టు బెయిల్ అయితే ఇవ్వలేదు కానీ.. ఆయన్ని మెరుగైన వైద్యం కోసం ఇమ్మిడియట్ గా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించమని ఆర్డర్ వేయగా పోలీసులు వల్లభనేని వంశి ని జైలు నుంచి ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించింది. 

శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి అవసరమైన వైద్య సేవలు చేశారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించడంతో.. ఈరోజు సోమవారం వంశీ ని ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించారు. అక్కడ డిశ్చార్జ్ కాగానే వంశీ ని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమర్పించబోయే నివేదిక కోర్టులో కీలకం కానుంది.

Vallabhaneni Vamsi Moved to Ayush Hospital Amid Health reasons

vamsi