వర్మ కలిస్తే తట్టుకోలేకపోతున్నారు
Minister Nadendla Opens Ration Shop in Pithapuramపిఠాపురంలో టీడీపీ, జనసేన తన్నుకుంటే చూడాలని బ్లూ మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. టీడీపీ వర్మ పవన్ కళ్యాణ్ ను గెలిపించాక తనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కినా నాగబాబు ఎమ్యెల్సీ అయ్యాక పిఠాపురారంలో వర్మ కు, టీడీపీ కార్యకర్తలకు అవమానాలు ఎక్కువవ్వడం నిజమే. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ పరిస్థితిని చక్కబెట్టి వర్మ ను దగ్గర చేసుకున్నారు.
తాజాగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం పంపిణి కార్యక్రమం పునః ప్రారంభించారు. ఆ కార్యక్రమం కోసం వర్మ కు కూడా ఆహ్వానం అందింది. దానితో SVSN వర్మ ఆ బియ్యం పంపిణి కార్యక్రమంలో సందడి చేసారు. అది చూసాక బ్లూ మీడియా కడుపు మండిపోతుంది.
టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు తన్నుకు చస్తారు, వర్మ పిఠాపురంలో జనసేనకు చుక్కలు చూపిస్తారనుకుంటే ఇలా వర్మ కూల్ గా జనసేన మంత్రి రేషన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం చూసి వర్మపై జనసేన దయ చూపించింది అంటూ కథనాలు వండి వారుస్తుంది బ్లూ మీడియా.
Varma at Minister Nadendla Opens Ration Shop in Pithapuram







































