ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR and Ram Charan Holidaying in Dubai

దుబాయ్ లో రామ్-భీమ్

ఆర్.ఆర్.ఆర్ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న రామరాజు-భీమ్ ఇద్దరూ ఒక చోట కనిపిస్తే అభిమానులకు పండగే. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోనే కాదు ఆ చిత్ర ప్రమోషన్స్ లోను రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి చేసిన సందడి ఇప్పటికి యూట్యూబ్ ల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ లో ఏ హీరోని తక్కువ చెయ్యకుండా రాజమౌళి న్యాయం చేసినా కొంతమంది అభిమానుల నడుమ చిచ్చు పెట్టేందుకు ఏదోదో సృష్టించారు. 

ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసమే కాదు వారిరువు మంచి ఫ్రెండ్స్, ఆ చిత్రం కన్నా ముందు వారి స్నేహం ఎవరికీ తెలియకపోయినా.. ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యాక వారి స్నేహాన్ని ఎంజాయ్ చేసారు. చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అంతా వారి కాంబో ని ఇష్టపడ్డారు. వారు కలిసి కనిపిస్తే అది క్షణాల్లో వైరల్ అయ్యేది. 

మరి ఇపుడు మరోసారి చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇద్దరూ దుబాయ్ లో కనిపించారు. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి కనిపించారు. క్రిస్టమస్ హాలిడేస్ ని రామ్-భీమ్ ఇద్దరూ దుబాయిలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారేమో అందుకే అలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే చరణ్ అమెరికా నుంచి వస్తూ దుబాయ్ లో బ్రేక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ నుంచి విరామం తీసుకుని ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లగా అక్కడ వీరు కలిసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Ram Charan and NTR Back Together

NTR and Ram Charan Holidaying in Dubai
ram charan