మరో రెండు రోజుల్లో దర్శకుడు క్రిష్ పెళ్లి

Director Krish wedding is in two days

డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో డాక్టర్ రమ్య ను వివాహం చేసుకున్న క్రిష్ చాలా త్వరగా భార్యతో విడాకులు తీసుకున్నారు, క్రిష్-రమ్య మధ్యలో వ్యక్తిగత విభేదాల తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని వేరయ్యారు, ఆతర్వాత రమ్య అమెరికాలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. 

తాజాగా క్రిష్ కూడా రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. గైనకాలజిస్ట్ ప్రీతీ చల్లా ను క్రిష్ రెండో వివాహం చేసుకోబోతున్నారు. క్రిష్-ప్రీతీ చల్లా వివాహం నవంబర్ 10 అంటే ఈ ఆదివారం హైదరాబాద్ లో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. క్రిష్ కి మాత్రమే కాదు ప్రీతి చల్లాకు కూడా ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది.  

Director Krish to Marry Gynecologist Dr Priti Challa

director krish