ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun and Trivikram New Project Update

అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్

గుంటూరు కారం సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఇంతకు ముందు మహాభారతం నేపథ్యంలో అల్లు అర్జున్‌తో పాన్ వరల్డ్ సినిమాగా ప్రకటించిన సినిమాయేనా? అనే అనుమానాలతో ఉన్నవారికి క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాపై హైప్స్ పెంచేలా అప్పుడే నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్ మొదలెట్టారు.

ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప2 సినిమా విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేసే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్-అల్లు అర్జున్‌గారి సినిమాను ఒక స్పెషల్ ప్రోమోతో జనవరిలో (సంక్రాంతి స్పెషల్) అనౌన్స్ చేస్తాం. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అల్లు అర్జున్‌గారు కూడా మార్చి నుండే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పిన నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. 

ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చూడని, టచ్ చేయని సబ్జెక్ట్‌ని త్రివిక్రమ్‌గారు రెడీ చేశారు. ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. నిర్మాణం విషయంలో మేము కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని తీసుకున్నామని నాగవంశీ తెలిపారు. నాగవంశీ ఇచ్చిన ఈ అప్డేట్‌తో ఈ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లుగా పోస్ట్‌లు పెడుతున్నారు.

Producer Nagavamsi Talks about Bunny and Trivikram Combo Project

Allu Arjun and Trivikram New Project Update
allu arjun
trivikram
nagavamsi