ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chaitanya - Sobhita engagement on cards

షాకింగ్: నాగ చైతన్య ఎంగేజ్మెంట్

Chaitanya - Sobhita engagement on cards

నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సమంత ని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య ఆమెతో నాలుగేళ్ళ కాపురాన్ని విడాకులతో ముగించాడు. ఆ తర్వాత విడాకుల విషయంలో సమంత ఎలా ఉన్నా నాగ చైతన్య మాత్రం చాలా సైలెంట్ గా కనిపించాడు. 

ఆతర్వాత నాగ చైతన్య లైఫ్ లోకి హీరోయిన్ శోభిత దూళిపాళ్ళ వచ్చి చేరింది అంటూ రకరకాల రూమర్స్ వినిపించాయి. ఇద్దరు కలిసి సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారని, కలిసి వెకేషన్స్ లో టైమ్ స్పెండ్ చేస్తున్నారని చాలారకాల వార్తలతో పాటుగా ఫొటోస్ బయటికొచ్చాయి. ఈ విషయంలో చైతు-శోభిత ఇద్దరూ స్పందించలేదు. 

కానీ షాకింగ్ గా ఈరోజు గురువారం నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వార్త వైరల్ గా మారింది. చైతు-శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. నాగ చైతన్య-శోభితలు కేవలం కుటుంబీకుల సమక్షంలో నేడు ఒక ప్రయివేట్ వేడుకగా ఈ ఎంగేజ్మెంట్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసుకున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఇరువురు ఎలా స్పందిస్తారా అనేది వేచి చూడాలి. 

Naga Chaitanya - Sobhita engagement on cards

naga chaitanya