ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balakrishna Meets Late Actor Taraka Ratna Family

తారకరత్న ఫ్యామిలీతో బాలయ్య-మోక్షజ్ఞ

Balakrishna Meets Late Actor Taraka Ratna Family

గత ఏడాది తారకరత్న మరణించకముందు, మరణించాక నందమూరి బాలకృష్ణ అన్నకొడుకు కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ కుటుంబ బాధ్యతలని తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళు నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్న తారకరత్న భార్య పిలల్లు, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి, బాలయ్య కి దగ్గరగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ సినిమా షూటింగ్స్ ని పక్కనబెట్టి పాలిటికల్ గా బిజీ అయ్యారు. ఆయన హిందూపురం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో అక్కడ నామినేషన్ వెయ్యడం దగ్గర నుంచి ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. 

అయితే తారకరత్న భార్య లేఖ్య తన ఇన్స్టా పేజీలో బాలయ్య తో పాటు అయన కొడుకు మోక్షజ్ఞతో కలిసి తాను, పిల్లలు ఉన్న అపురూపమైన ఫోటొస్ ని షేర్ చేసింది. ఆ పిక్ చూసి బాలయ్య, మోక్షజ్ఞ లకి తారకరత్న ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ చూసి నందమూరి అభినులు ఎంతో ముచ్చటపడిపోతున్నారు. అంతేకాదు.. ఇలా మోక్షు, బాలయ్య ఎంతో ఆహ్లాదంగా చిరు నవ్వుతో కనిపిస్తూ ఉండడంతో ఇపుడు నందమూరి అభిమానుల్లో ఈ ఫోటో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది.

ఈ ఫోటోను పంచుకుంటూ అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ చేసింది. నేను ఎటు వైపు ఉన్నానని ఎప్పుడూ నన్ను అడుగుతున్నారు. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము అంటూ రాసుకొచ్చింది. అప్పుడప్పుడు తారకరత్న పిల్లలతో గడపడానికి వచ్చే బాలయ్య ఈసారి మోక్షుని కూడా వెంట తీసుకురావడంతో ఆ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. 

Nandamuri Balakrishna Meets Late Actor Taraka Ratna Family with his Son Mokshagna

mokshagna