భయపెడుతున్న అనసూయ

Anasuya latest look viral

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ కి విపరీతమైన లైక్స్, షేర్స్ వస్తూ ఉంటాయి. అనసూయ కూడా తాను ఏ ఈవెంట్ కి వెళ్లినా, లేదంటే షాప్ ఓపెనింగ్ కి వెళ్లినా, ఇంటర్వ్యూకి వెళ్లినా ఆ ఫొటోస్ ని ఖచ్చితంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అనసూయ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ని అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై గతంలో ట్రోల్స్ నడిచేవి. వాటికి తగిన రీతిలో అనసూయ కౌంటర్ కూడా ఉండేది.

ఈమధ్యన అనసూయ ఎక్కువగా శారీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. శారీస్ తో చేసిన ఫోటో షూట్స్ నే షేర్ చేస్తుంది. మోడరన్ లుక్స్ చాలా అరుదుగా పోస్ట్ చేస్తుంది. అయితే అనసూయ కొన్నాళ్లుగా బరువు పెరిగిపోయి కనబడుతుంది. అందుకే ఆమె మోడ్రెన్ వేర్ ని అవాయిడ్ చేసింది అనుకుంటున్నారు. అదలావుంటే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజెన్స్ భయపడుతున్నారు.

అలాగని అనసూయ మరీ దెయ్యంలా రెడీ అవ్వలేదు. మోడ్రెన్ డ్రెస్ వేసుకున్నా.. ఆమె పెదవులకి వేసుకున్న లిప్ స్టిక్ చూస్తే ఆమ్మో ఏంటి ఇది అనసూయ ఇంత భయానకమైన లిప్ స్టిక్ తో భయపెట్టేసావ్ అంటారు. ఆమె డ్రెస్ బావుంది, ఇచ్చిన ఫోజులు సూపర్బ్, కానీ ఆ లిప్ స్టిక్ మరీ ఆడ్ గా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Anasuya Bharadwaj latest look goes viral

anasuya