రోజాకి చుక్కలు చూపిస్తున్న సోషల్ మీడియా

నిన్నటివరకు నగరి టికెట్ రోజా కి ఇచ్చే ఆలోచనలో జగన్ లేరు అన్నా రోజా మాత్రం మరోసారి నగరి టికెట్ నాకే అని ధీమా వ్యకం చేసినట్టుగానే నగరి టికెట్ ని రోజాకు కేటాయించారు. రోజా పాలిటిక్స్ లోకి రాకముందు నటి. ఆమె MLA గా ఎన్నికయ్యాక కూడా జబర్దస్త్ షో కి జెడ్జ్ గా వ్యవహరించింది. కానీ మంత్రి పదవి చేపట్టాక ఆమె జబర్దస్త్ లాంటి షోస్ కి పూర్తిగా దూరంగా ఉంటుంది.
అయితే టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళాక రోజా మహిళా ఫైర్ బ్రాండ్ మాదిరి ప్రతి పక్షాలు ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడడమే కాదు, జనసేన నేత పవన్ కళ్యాణ్ టీడీలో కలవడం తట్టుకోలేని రోజా పవన్ కళ్యాన్ ని నానా మాటలు మాట్లాడింది. అయితే నగరిలో రోజా అభివృద్ధి చెయకుండా ఆమె ప్రజలని పట్టించుకోవడం లేదు, అందుకే జగన్ ఆమెని ఈసారి పక్కనబెట్టారనే ప్రచారం జరిగినా.. ఫైనల్ గా రోజాకి టికెట్ వచ్చేసింది.
అయితే ఇప్పుడు రోజాకి సోషల్ మీడియాలో చుక్కలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో పూర్తి మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ మీముందుకు ఓట్లు అడగడానికి జగన్ గారు వస్తారు, ఆయన తన చెల్లెల్లు షర్మిల, సునీతలను ఎంతగా గౌరవం ఇస్తారో రాష్టంలో ఉన్న అందరిని అక్క చెల్లెలుగా గౌరవం ఇస్తారంటూ చెప్పిన పాత వీడియోని బయట పెట్టి ట్రెండ్ చేసున్నారు.
ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏపీ లో మద్యం ఏరులై పారడం కాదు, కల్తీ మద్యం వలన చాలామంది చనిపోయారు. అంతేకాకుండా చెల్లెలు షర్మిలని మోసం చెయ్యడంతో ఆమె కాంగ్రెస్ లో చేరింది. అప్పటి నుంచి షర్మిలని తన మంత్రులతో జగన్ నానా మాటలనిపిస్తున్నారు. మరోపక్క చిన్నాన్న కూతురు సునీత జగన్ పై ఆరోపణలు చేస్తున్న సమయంలో రోజా మాట్లాడిన పాత వీడియో ని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ రోజాని ఆడేసుకుంటున్నారు యాంటీ పార్టీ వాళ్ళు.
TDP sharing Roja speech old videos
TDP sharing Roja old videos







































