అందమైన భామలు ఒకే ఫ్రేమ్ లో..
Tamannaah and Raashi Khanna in single frameఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ సింగిల్ ఫ్రేమ్ లో అందులోను గ్లామర్ గా కనబడితే అభిమానులు ఆగుతారా.. అస్సలు ఆగరు. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హోరెత్తిస్తారు. సౌత్ లో ఆఫర్స్ తగ్గాక ప్రస్తుతం హిందీలో అవకాసాలు వెతుక్కుంటున్న తమన్నా, రాశి ఖన్నా ఇద్దరూ గ్లామర్ విషయంలో పోటీపడతారు. సౌత్ లో చూపించిన గ్లామర్ కి డబుల్ డోస్ ని హిందీ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు. తమన్నా అక్కడ వెబ్ సీరీస్ లు సినిమాలు అనడమే కాదు.. బాయ్ ఫ్రెండ్ కూడా హిందీ లోనే చూసుకుంది. నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.
ఇక రాశి ఖన్నా ఫార్జి వెబ్ సిరీస్ తర్వాత హిందీలో దూసుకుపోతుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన యోధా చిత్రం రీసెంట్ గానే విడుదలైంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ గా అదరగొట్టేసింది. ఆ యోధా ఈవెంట్స్ లో రాశి ఖన్నా మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో గ్లామర్ గా అదరగొట్టేసింది.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు భామలు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేసారు. అరణ్మణై 4 ట్రైలర్ లంచ్ లో పాల్గొన్నారు. తమన్నా, రాశి ఖన్నా ఇద్దరూ ఈ అరణ్మణై 4 లో గ్లామర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, రాశి ఖన్నా ఇద్దరూ ఒకరిని మించి మరొకరు గ్లామర్ షో చేసారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ##RaashiiKhanna, #TamannaahBhatia హాష్ టాగ్స్ ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతూ కనిపించాయి. మీరు కూడా రాశి, తమన్నా అందాలను ఓ లుక్కెయ్యండి.
Tamannaah and Raashi Khanna latest pic goes viral






































