ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varun Tej and Lavanya Tripathi Spotted at Mumbai Airport

ముంబై ఎయిర్ పోర్ట్ లో వరుణ్-లావణ్యలు

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని జూన్ లో పెద్దల సాక్షిగా నిశ్చితార్థంతో ఒక్కటిగా మారిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఇప్పుడు నవంబర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబందించిన షాపింగ్ మొదలు పెట్టేసింది ఈ జంట. హైదరాబాద్ లోనే వరుణ్-లావణ్య ల వెడ్డింగ్ షాపింగ్ జరుగుతుంది. 

ఈరోజు వరకు ఈజంట విదేశాలకి పెళ్లి వేదిక కోసం వెళ్ళారని తెలుస్తోంది. ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆ వేదిక, ఆ ఈవెంట్ కి సంబందించిన ఏర్పాట్లని వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు స్వయంగా చూసుకుంటున్నారు. తాజాగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించగా.. ఫోటో గ్రాఫర్స్ వాళ్ళ వెంట పడ్డారు. 

లావణ్య త్రిపాఠి మోడ్రెన్ లుక్ లో కనిపించగా.. వరుణ్ తేజ్ నార్మల్ గా కనిపించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీ ఎయిర్ పోర్ట్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Mega prince Varun Tej and Lavanya papped at the airport off to Hyderabad

Varun Tej and Lavanya Tripathi Spotted at Mumbai Airport
varun tej