ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kushi second single Aradhya releasing on July 12th

ఖుషి నుండి లవ్లీ పోస్టర్

Kushi second single Aradhya releasing on July 12thKushi second single Aradhya releasing on July 12th

 విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  విజయ్, సమంతల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటిస్తూ మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్‌లు ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం నాడు, పాటను బుధవారం నాడు విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు.

ఇప్పటికే నా రోజా నువ్వే అనే పాటు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ఆరాధ్యతో మరో సారి ఖుషి సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది.

Vijay Deverakonda Kushi second single Aradhya releasing on July 12th

kushi