కీర్తి సురేష్ వెరైటీ లుక్

Keerthy Suresh variety lookKeerthy Suresh variety look

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారిన మహానటి కీర్తి సురేష్.. ఆ మహానటి టాగ్ నుండి బయటపడేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే పద్దతిగా ఉండే కీర్తి సురేష్ గ్లామర్ కి తెర లేపింది. ఒబ్బిడిగా ట్రెడిషనల్ హీరోయిన్ గా ఉంటే అవకాశాలు రావు, కమర్షియల్ హిట్ కొట్టాలంటే అందాలు చూపించాల్సిందే అని డిసైడ్ అవడమే తరువాయి.. గ్లామర్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దసరాతో కమర్షియల్ హిట్ కొట్టిన కీర్తి సురేష్ కి తెలుగులో భోళా శంకర్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. అది కూడా ఆగష్టు 11న విడుదలవుతుంది. 

ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు తెలుగులో వినిపించకపోయినా ఆశ్చర్య పోవక్కర్లేదు. ఈలోపులో ఏదైనా ప్రాజెక్ట్ దొరికితే ఓకె. ఇక ప్రస్తుతం తమిళనాట కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం మామన్నన్ ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ డే 1 ప్రమోషన్స్ అంటూ వెరైటీ లుక్ ని షేర్ చేసింది. ఎప్పుడూ బుల్లి ఫ్రాక్స్ లోనో.. లేదంటే శారీస్ లోనో, చుడీదార్స్ లోనో కనిపించే కీర్తి సురేష్.. ఇలా కొత్తగా బ్లేజర్ లాంటి డ్రెస్ లో కనిపించడం, అలాగే ఆమె మేకప్, ఐ లైనర్ లాంటివి చూస్తే కొద్దిగా వెరైటీ లుక్ ని కీర్తి ట్రై చేసిందేమో అనిపించక మానదు. 

తమిళనాట మామన్నన్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న కీర్తి సురేష్ తన అందాలను సోషల్ మీడియాకి తాకిస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ ప్రాజెక్ట్స్ లో బిజీగా కనిపిస్తుంది. చిరు చెల్లెలిగా నటించిన భోళా శంకర్ ఆగష్టు 11న విడుదలకి రెడీ అవుతుంది.

Keerthy Suresh variety goes look

keerthy suresh