సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే శృతి హాసన్ తరచూ తన ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. గ్లామర్ గానే కాదు చిత్ర విచిత్ర ఫోటో షూట్స్ తో అభిమానులని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీ సలార్ మూవీలో నటిస్తుంది. ఈ ఏడాది వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. గ్లామర్ గానే హొయలు పోతూ అవకాశాలు పట్టేస్తుంది అనుకుంటే పొరబాటే. క్రాక్ లో కత్తిలా కనిపించిన శృతి హాసన్ ఆ సినిమలో విలన్స్ ని చితక్కొట్టే యాక్షన్ సీన్ లో అందరికి షాకిచ్చింది. ఆ ఫైట్ చూసాకే ఆమెకి ప్రశాంత్ నీల్ సలార్ ఛాన్స్ ఇచ్చాడు.
ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో పాటుగా.. బాయ్ ఫ్రెండ్ శాంతను తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న శృతి హాసన్ పేరు సోషల్ మీడియాలో తప్ప ఇతర విషయాల్లో అంటే ఆమె నటించే సినిమాల విషయాల్లో పెద్దగా వినిపించడం లేదు. ఇక శృతి హాసన్ ఈమధ్యన హెల్త్ ఇష్యుస్ ని ఫేస్ చెయ్యడమే కాదు.. వాటిని ధైర్యంగా అందరి ముందు పెడుతూ మహిళల్లో చైతన్య నింపుతుంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో కాస్త విచిత్రమైన గెటప్ లో కనిపించింది.
కాఫీ కలర్ అవుట్ ఫిట్ లో ఒంటి నిండా డ్రెస్ వేసుకుని లూజ్ హెయిర్ తో కొత్తగా కనిపించింది. పెద్ద పెద్ద కళ్ళతో అదరగొట్టేసిన శృతి హాసన్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.