ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aishwarya Lekshmi shares a new photo with Arjun Das

ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో ట్విస్ట్

Aishwarya Lekshmi shares a new photo with Arjun Das

మలయాళ మైటీ ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో పడింది. అది కూడా విజయ్ మాస్టర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన అర్జున్ దాస్ తో ఆమె డేటింగ్ చేస్తుంది అనుకునేలా ఐశ్వర్య లక్ష్మి అర్జున్ తో క్లోజ్ గా ఉన్న పిక్ ని ఇన్స్టాలో షేర్ చేస్తూ హార్ట్ సింబల్ పెట్టింది. దానితో నిజంగానే ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో పడింది అని అర్జున్ కి ఆమెకి కలిపి అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. 

కొంతమంది ఇదంతా ఏదో సినిమా ప్రమోషన్స్ కోసం చేసిందే, ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ తీసిపారేసారు.

నిజంగానే ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో ఓ ట్విస్ట్ ఉంది. అదే విషయాన్ని ఐశ్వర్య లక్ష్మి బయటపెట్టింది. నా పోస్ట్ ఇంతిలా స్ప్రెడ్ అవుతుంది అని తెలియదు, మేమిద్దరం సరదాగా కలిసినప్పుడు ఓ ఫోటో దిగాము. అదే పిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. అంతకు మించి మా మధ్యన ఇంకేమి లేదు, ఒక్కరోజులోనే అర్జున్ దాస్ ఫాన్స్ తెగ మెసేజ్ లు పెడుతున్నారు. అర్జున్ నా వాడు కాదు, మీవాడే అందరికి ఇదే చెబుతున్నా అంటూ ఐశ్వర్య లక్ష్మి అందరికి ఝలక్ ఇచ్చింది.

Aishwarya Lekshmi Clears Dating Rumours With Arjun Das

aishwarya lekshmi
arjun das