ఇంకా కన్ఫ్యూజన్ లోనే విజయ్
Vijay Deverakonda is still confusedవిజయ్ దేవరకొండ లైగర్ తర్వాత చెయ్యాల్సిన జన గణ మన అఫీషియల్ గా ఆగిపోయింది. పూరి జగన్నాథ్ తో మరోసారి సినిమా చేస్తే మార్కెట్ పుంజుకుంటుందో లేదో అనే విషయంలో విజయ్ దేవరకొండ ఆ మూవీ నుండి తప్పుకున్నాడని తెలుస్తుంది. మరోపక్క ఖుషి షూటింగ్ కూడా ఇంకా హోల్డ్ లోనే ఉంది. సమంత షూటింగ్ స్పాట్ కి వచ్చేవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఈమధ్యనే శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత అంత కంఫర్టుబుల్ గా లేదు. ఆమె హెల్త్ ఇంకా సహకరిస్తున్నట్టుగా అనిపించడం లేదు. సో అలా ఖుషి విషయంలో విజయ్ దేవరకొండ ఇరుక్కుపోయాడు. మరో సినిమాకి కమిట్ అవ్వలేదు.
దానితో షూటింగ్ స్పాట్ లో చెయ్యాల్సిన సందడి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చేస్తున్నాడు. క్రిష్టమస్, న్యూ ఇయర్ ఇలా సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులని యాక్టీవ్ చేస్తున్నాడు. ఖుషి తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకె చేసినా కనీసం ఆ సినిమా సెట్ లో అయినా పని చేసుకునేవాడు. కానీ విజయ్ దేవరకొండ తన దగ్గరికి ఎలాంటి కథ వచ్చినా లైగర్ డ్యామేజ్ ని మరిపించేదిలా ఉండాలని ఫిక్స్ అయ్యి కథలను వడపోస్తున్నట్లుగా తెలుస్తుంది.
అటు స్టార్ డైరెక్టర్స్ కూడా ఎవరూ ఖాళీగా లేరు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ అందరూ పెద్ద హీరోలతో సినిమాలకి కమిట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ ల షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా డైలమాలోనే కనబడుతున్నాడు. కానీ ఫాన్స్ కి దగ్గరగా ఉంటూ ఉనికిని చాటుకుంటున్నాడు.
Confused Vijay Devarakonda To Move Forward?







































