ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 6: Direct Elimination is a shocking Nagarjuna

బిగ్ బాస్ 6: డైరెక్ట్ ఎలిమినేషన్ షాక్

Bigg Boss 6: Direct Elimination is a shocking Nagarjuna

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి నాగార్జున బిగ్ షాక్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళని లేపి మరీ నాగ్ వాళ్లపై ఫైర్ అయ్యారు. వాసంతి గేమ్ బాగా ఆడినా ఎందుకు సూర్యకి ఇచ్చేసావ్ అన్నారు. దానితో సూర్య నన్ను.. ఫైమా, కీర్తి, ఇనాయకన్నా తక్కువ గేమ్ ఆడుతున్నావ్ అన్నాడు అంది. సూర్య నువ్ ఫెమినిస్ట్ వా.. అలా అనుకోవడం కరెక్ట్ నా అని అడిగారు. ఇక శ్రీహన్-శ్రీసత్య మీరు ఫెయిర్ ఆడారా.. గీతు సహాయం మీద మీ గేమ్ ఉంది అంటూ క్లాస్ పీకడమే కాదు, శ్రీసత్య బాలాదిత్యని అన్నమాటలకి సారి చెప్పాను అనగానే గీతు చెప్పింది అని చెప్పవా అంటూ నాగ్ కౌంటర్ వేసాడు. ఇక రేవంత్ నువ్ ఉన్మాదిలా టాస్క్ ఆడుతున్నావ్.. గీతు, శ్రీసత్యలని పడేసావ్ అంటూ వీడియోస్ చూపించగానే.. నేను ఇంటెన్షనల్ గా పడెయ్యలేదు అన్నాడు. 

కానీ నీ గేమ్ అలానే ఉంది అన్నారు నాగ్. ఫైమా నీ కామెడీ ఒక్కోసారి హద్దులు దాటుతుంది.. అర్ధమవుతుందా అంటూ ఫైమకి క్లాస్ పీకిన ప్రోమో వైరల్ అవ్వగా.. ఇక్కడో బిగ్ షాక్ ఇచ్చారు నాగ్ కంటెస్టెంట్స్ కి. ఈరోజు డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగ్. ఇప్పుడే ఇక్కడే అంటూ నాగ్ దగ్గర ఉన్న ఓ రెడ్ కలర్ క్లాత్ మీద నాగార్జున ఆ పేరుని సూచించగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. మరి ఈ రోజు డైరెక్ట్ ఎలిమినేషన్ లో హౌస్ ని వీడింది సూర్య అంటున్నారు. చూడాలి ఎంతవరకు నిజమో అనేది.

Bigg Boss 6: Nagarjuna Fires on housemates

bigg boss 6
nagarjuna
revanth
surya