ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Khushi: Will Vijay-Samantha fans agree?

ఖుషి: విజయ్-సమంత ఫాన్స్ ఒప్పుకోరేమో?

Khushi: Will Vijay-Samantha fans agree?

ఖుషి కొత్త షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని విజయ్ దేవరకొండ, సమంత ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ వెంటనే పనిలో పడిపోయి.. ఆ డిసాస్టర్ విషయాన్ని మర్చిపోదామనుకున్నాడు. కానీ సమంత ఖుషి టీమ్ కి అందుబాటులోకి రాకపోవడంతో దేవరకొండ కూడా జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ లో ఖుషి రిలీజ్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ, మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కారణం షూటింగ్ కి బ్రేక్స్ రావడమే.

ఖుషి ప్యూర్ లవ్ స్టోరీగా ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే తాజాగా ఖుషి క్లైమాక్స్ పై ఓ న్యూస్ విజయ్-సమంత అభిమానులకి షాకిస్తుంది. ఖుషి క్లైమాక్స్ విషాదాంతంగా ముగుస్తుందట. హీరో-హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, సమంత పాత్రలు రెండూ సినిమాలో చనిపోతాయట. కాకపోతే ఈ పాత్రల అంతాన్ని సినిమా చివర్లో చూపించి సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా ఉండాలన్న కారణంతో టైటిల్ కార్డ్ పడిన వెంటనే విజయ్-సమంత పాత్రలు చనిపోయినట్టుగా చూపిస్తారని తెలుస్తుంది. అసలు వీళ్లు ఎందుకు చనిపోయారు అనేది ఫ్లాష్‌బ్యాక్ స్టోరీతో సినిమాని దర్శకుడు నడిపిస్తాడట. ఈ న్యూస్ చూసిన విజయ్-సమంత ఫాన్స్ బాగా ఫీలైపోతున్నారు. 

Vijay Devarakonda-Samantha Kushi update

vijay devarakonda
samantha
kushi movie