Advertisement

RC15 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting update on RC15

RC15 టీం ప్రస్తుతం అమృత్ సర్ లో సందడి చేస్తుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న RC15 షూటింగ్ కొత్త షెడ్యూల్ అమృత సర్ లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ - కియారా అద్వానీలు కలిసి సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే 400 మంది బ్యాగ్రౌండ్ డాన్సర్స్ తో శంకర్ ఈ సాంగ్ ని చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. గణేష్‌ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రాఫర్‌ గా పని చేస్తున్నారు. సినిమాలో ఈ సాంగ్ హైలెట్ గా నిలవబోతుంది అని అంటున్నారు.

ఇక ఈ సాంగ్ తర్వాత RC 15 టీం అక్కడే అమృత సర్ లోనే ఇంకొన్ని రోజులపాటు స్పెండ్ చెయ్యబోతుందట. ఎందుకంటే ఈ సాంగ్ కంప్లీట్ కాగానే అదే షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను శంకర్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ 20 రోజుల పాటు జరుగుతుందని, ఈ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్‌ దాదాపుగా 75 శాతం పూర్తవుతుందట. ఆ తర్వాత షూట్‌ కోసం విదేశాలు వెళ్లనుంది యూనిట్‌. 

RC15 shooting update

rc15
rc15 update
ram charan
shankar
kiara advani