ఫస్ట్ ప్రభాసా.. చిరునా.. మారుతి
Maruthi directing Prabhas or Chiranjeevi?పక్కా కమర్షియల్ చిత్రం తర్వాత దర్శకుడు మారుతి పెద్ద డైరెక్టర్ అయ్యిపోతున్నాడు. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు ప్రభాస్, చిరు తో సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. అసలు ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే అందరిలో విపరీతమైన ఆశ్చర్యం. అలాంటి టైం లోనే ఆ సినిమాపై అనేకరకాల న్యూస్ లు సోషల్ మీడియాని కమ్మేశాయి. ముఖ్యంగా ప్రభాస్ తో మారుతి హర్రర్ కామెడీ చేయబోతున్నాడని, ఆ సినిమాకి రాజా డీలక్స్ అని పేరు టైటిల్ ఫిక్స్ చేసారని, ఈ సినిమాలో ప్రభాస్ చాలా తక్కువ డేట్స్ ఇస్తే సరిపోతుంది అని, ఇండోర్ లోనే షూటింగ్ అంతా పూర్తి చేస్తారని, దాని కోసం ఓ ఇంటి సెట్ వేస్తున్నారని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారంటూ రకరకాల న్యూస్ లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తాజాగా పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ లో మారుతి ప్రభాస్ ప్రోజెక్ట్ పై వస్తున్న వార్తలను నమ్మవద్దని, పక్కా కమర్షియల్ తర్వాత తన తదుపరి ప్రోజెక్ట్ గురించి ప్రకటిస్తామని, ప్రస్తుతం ఈ సినిమాపైనే తమ ఫోకస్ ఉంది అని, అటు చిరు, ఇటు ప్రభాస్ సినిమాలపై తానే క్లియర్ గా అధికారికంగా ప్రకటిస్తాను అని, అప్పటివరకు ఎలాంటి గాసిప్స్ నమ్మవద్దు అంటూ రిక్వెస్ట్ చెయ్యడం చూస్తే మారుతి ముందు ప్రభాస్ తో సినిమా చేస్తాడా? లేదంటే ప్రభాస్ తోనా అనే కన్ఫ్యూషన్ లో ఫాన్స్ ఉన్నారు. ఎలాగూ చిరు మారుతి తో సినిమా ఉండబోతున్నట్లుగా కన్ ఫర్మ్ చేసారు గనక ఇప్పుడు ప్రభాస్ తో ముందా? లేదా చిరు తోనా అనేది తేలాల్సి ఉంది.
Star director with Prabhas or Chiranjeevi?







































