భోళా శంకర్ నుండి అదిరిపోయే అప్ డేట్
Bholaa Shankar Shooting Schedule Begins Fromచిరంజీవి-మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. ఏ సినిమా తమిళ సూపర్ హిట్ ఫిలిం వేదాళం రీమేక్. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకునం భోళా శంకర్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
Chiranjeevi, Meher Ramesh Mega Massive Movie Bholaa Shankar New Shooting Schedule Begins From June 21st







































