Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> In Jabardasth the comedy is gone and the tragedy remains

జబర్దస్త్ లో కామెడీ పోయి ట్రేజడి మిగిలింది

In Jabardasth the comedy is gone and the tragedy remains

జబర్దస్త్ అంటే కామెడీ కి కేరాఫ్ అడ్రెస్స్. ఒకప్పుడు జబర్దస్త్ షో ని కొట్టాలనే కసితో ఇతర ఛానల్స్ కామెడీ షోస్ చేసి చేతులు కాల్చుకున్నాయి. కానీ జబర్దస్త్ షో ని ఏమి చేయలేకపోయాయి. ఈటీవీలో గురు, శుక్రవారాల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో లో కనిపించే కమెడియన్స్ కి విపరీతమైన పాపులారిటీ ఉండేది. అలాంటి జబర్దస్త్ ఇప్పుడు మసకబారుతుంది. కామెడీ స్థానంలో ట్రాజడీ మిగిలింది. జేడ్జ్ గా నాగబాబు వెళ్ళాక ఆయన ప్లేస్ లోకి మనో వచ్చినా ఆయన కూడా పర్మినెంట్ గా కనిపించలేదు. ఇక రోజా మినిస్టర్ పదవితో జబర్దస్త్ కి బై బై చెప్పేసాక.. ఆ ప్లేస్ లోకి ఒక్క పేరున్న జేడ్జ్ రాలేదు. వారానికో జేడ్జ్ మారుతున్నారు. 

అలాగే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇలా టాప్ కమెడియన్స్ జబర్దస్త్ కి దూరమయ్యారు. హైపర్ ఆది వెళ్ళాక షేకింగ్ శేషు ఏదో టీం ఫామ్ చేసుకుని కామెడీ చేస్తున్నాడు. సుధీర్, శ్రీను వెళ్ళాక రామ్ ప్రసాద్ ఒక్కడే తంటాలు పడుతున్నాడు. మొన్నామధ్యన అనిల్ రావిపూడి ఆటో లో నీ వీల్స్ లేకుండా స్కిట్ చేస్తున్నావ్ ఎలా ఉంది అనగానే రామ్ ప్రసాద్ ఎమోషన్ అయ్యాడు. ఇక వచ్చే వారం రాకింగ్ రాకేష్ ముగ్గురు ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్ - సుధీర్ - గెటప్ శ్రీనులా స్కిట్ చేసాడు. వారు ఎలా కలిశారు, జబర్దస్త్ కి ఎలా వచ్చారు, ఇప్పుడు గెటప్ శ్రీను మూడు నెలలు బ్రేక్ తీసుకుని ఎలా దూరమయ్యాడు. అదే సమయంలో సుధీర్ కూడా నేను జబర్దస్త్ కి రాలేకపోతున్నా అంటూ చేసిన స్కిట్ కి రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. 

అలాగే జేడ్జ్ ఇంద్రజ మీ టీం కి ఎవరి దిష్టి తగిలిందో అంటూ కన్నీళ్లు పెట్టిన స్కిట్ వచ్చే వారం ప్రసారం కాబోతుంది. ఇది చూసిన బుల్లితెర ప్రేక్షకులు జబర్దస్త్ లో కామెడీ స్థానాల్లో ట్రాజడీ కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Extra Jabardasth Ram Prasad Emotional Words About Sudheer And Getup Srinu

extra jabardasth
ram prasad
sudheer
getup srinu