ఈసారి భీమ్లా నాయక్ కన్ఫ్యూజన్
Bheemla Nayak will release on 25th February or 1st Aprilఈరోజు వరకు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో కన్ఫ్యూజ్ చేసారు. అంటే మార్చి 18 కానీ లేదంటే ఏప్రిల్ 28 కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటూ ప్రకటించారు. అలా రెండు డేట్స్ లాక్ చెయ్యడంతో.. మిగతా సినిమాల మేకర్స్ కి ఏం పాలుపోలేదు. రెండు డేట్స్ లో ఏ డేట్ కి ఆర్.ఆర్.ఆర్ వస్తుందో అని బెంగ పడితే.. తాజాగా రాజమౌళి క్లారిటీ ఇస్తూ ఆర్.ఆర్.ఆర్ మార్చి 25 కి వస్తుంది అని అధికారిక ప్రకటన ఇవ్వడంతో మిగతా వారు ఊపిరి పీల్చుకుతిన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
అంటే ఫిబ్రవరి 25 న పవన్ భీమ్లా నాయక్ విడుదల అని జనవరి 12 నుండి డేట్ షిఫ్ట్ చేస్తూ ప్రకటించారు. కానీ ఇంకా కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. ఈసారి భీమ్లా నాయక్ మేకర్స్ రెండు డేట్స్ లాక్ చేసారు. వస్తే ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ వచ్చేస్తుంది. లేదంటే ఏప్రిల్ 1 న భీమ్లా నాయక్ అని.. ఆచార్య డేట్ ని లాక్ చేసుకున్నారు. ఆచార్య ఏప్రిల్ 1 నుండి 29 కి షిఫ్ట్ అవడంతో.. ఇప్పుడు భీమ్లా నాయక్ మేకర్స్ ఏప్రిల్ 1 కి ఓ డేట్ లాక్ చేసి పెట్టడంతో.. మిగతా సినిమాల నిర్మాతల్లో మళ్ళీ టెంక్షన్ మొదలైపోయింది.
Pawan Kalyan Bheemla Nayak will release on 25th February or 1st April






































