ఆర్.ఆర్.ఆర్ లో షాకింగ్ ట్విస్ట్

RRR climax to blow the minds

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా హీరోలుగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై ఈపాటికి రెండు వారాలైపోయేది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ కలిసి పండగ చేసుకునేవారు. కానీ ఫాన్స్ దురదృష్టం, నిర్మాతలు దురదృష్టం కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక మార్చ్ 18 న కానీ, ఏప్రిల్ 28 న కానీ ఆర్.ఆర్.ఆర్ రావడానికి మళ్ళీ ఏర్పాట్లు చేసుకుంటుంది. పరిస్థితులు అన్ని బావుంటే మార్చ్ 18 కే ఆర్.ఆర్.ఆర్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడినా.. ఆ సినిమా ఫై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త మాత్రం నిత్యం చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ న్యూస్ ఒకటి బయటికి రావడం కాదు.. ఆ న్యూస్ చూసిన ప్రేక్షకులు షాకవుతున్నారు. క్లైమాక్స్ కోసమే చరణ్, ఎన్టీఆర్ లు రెండు నెలలు కొన్ని విద్యల్లో శిక్షణ తీసుకున్నారని, ఈ క్లైమాక్స్ కోసమే నిర్మాత 90 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టారని, నెగెటివ్ గా ఉన్నా ప్రస్తుతం ఆడియన్స్ క్లైమాక్స్ లకి ఇస్తున్న భరోసాతోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ ని డిజైన్ చేసారని అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ క్లైమాక్స్ ఉంటుంది అని అంటుంటే.. హీరోలు చనిపోతారేమోగా ని ఫాన్స్ భయపడుతున్నారు. కానీ హీరోలిద్దరూ చనిపోరని, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ ఇద్దరూ కూడా బ్రిటీష్ వాళ్లతో పోరాటంలో భాగంగా ఆ ఇద్దరూ వైకల్యం పొందుతారని ప్రచారం జరుగుతుంది. 

మరి ఈ క్లైమాక్స్ వింటేనే ఫాన్స్ కి కాస్త షాకయినా.. రాజమౌళిని చూపించే ఎమోషనల్ క్లైమాక్స్ కి మాత్రం ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Shocker about RRR climax

rrr movie
rrr climax
rajamouli
ntr
ram charan
rajamouli
danayya