బిగ్ బాస్ సీజన్ 6: కంటెస్టెంట్స్ అంతమందా..?

Bigg Boss Season 6 Soon

బిగ్ బాస్ సీజన్ 1 నుండి 15 మంది కంటెస్టెంట్స్ కి తగ్గకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. స్టార్ మా కూడా కాస్త పేరున్న సెలబ్రిటీస్ ని పట్టుకొచ్చి బిగ్ బాస్ లోకి పంపిస్తుంది. ఇక ఎన్టీఆర్, నాని.. తర్వాత నాగార్జున బిగ్ బాస్ సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి డిఫరెంట్ గా షో ని ప్లాన్ చేసింది. అందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ 6 ని హాట్ స్టార్ ఓటిటిలో 24 గంటలు చూసేలా ప్లాన్ చేసారు. ఫిబ్రవరి 20 నుండి ఈ సీజన్ 6 మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరిని పంపబోతున్నారో అనేది.. ఇప్పటికే ఆడిషన్స్ మొదలైపోయాయని.. లిస్ట్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది అంటున్నారు.

అయితే గత సీజన్ లో ఏకంగా 19 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే.. ఈ సీజన్ లోకి మాత్రం కేవలం 14 మందిని మాత్రమే పంపబోతున్నారట. 14 మంది సెలబ్రిటీస్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపి.. తర్వాత ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హోసూరు లోకి పంపుతారని.. 100 రోజుల పాటు ఈ షోని నడపనున్నారని తెలుస్తుంది. జనవరి నెలాఖరులోగా.. కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి.. బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోస్ రెడీ చేస్తారని.. ఫిబ్రవరి 20 న షో మొదలు పెడతారని తెలుస్తుంది.

Bigg Boss Season 6 Feb 20th

bigg boss
bigg boss season 6
bigg boss season 6 feb 20th
hot star
ott
star maa