Advertisementt

‘సాహో’ సాప్ట్ మెలోడీ సాంగ్ అదిరింది

Wed 31st Jul 2019 01:08 PM
saaho,ye chota nuvvunna,song,teaser,released  ‘సాహో’ సాప్ట్ మెలోడీ సాంగ్ అదిరింది
Saaho: Ye Chota Nuvvunna Song Teaser released ‘సాహో’ సాప్ట్ మెలోడీ సాంగ్ అదిరింది
Advertisement
Ads by CJ

ఆక‌ట్టుకుంటున్న సాహో సాప్ట్ మెలోడీ సాంగ్ ఏ చోటా నువ్వున్నా

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే సైకో స‌య్యానా అంటూ యావత్ దేశాన్ని ఉర్రూత‌లూగించిన ఈ చిత్ర బృందం ఇప్ప‌డు మ‌రో అద్భుత‌మైన పాట‌తో ప్రేక్షకుల ముందుకి వ‌చ్చారు. ఏ చోట నువ్వున్నా అంటూ మొద‌ల‌య్యే ఈ పాటకి సంబంధించిన వీడియో టీజ‌ర్ ని తాజాగా విడుద‌ల చేశారు. యూర‌ప్ లోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ పాట‌ను చిత్రీక‌రించిన‌ట్లుగా తెలిసింది. ఆగ‌స్ట్ 2న ఫుల్ లెంగ్త్ సాంగ్ ను విడుద‌ల చేస్తున్నారు. 

ఒక్కో పాట‌కు ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్

సాహోలో పాటలకు ఒక్కరే కాకుండా వేరే వేరే సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌లై ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న సైకో స‌య్యానా పాట‌కు తనిష్క్ బాగ్చి సంగీతం అందించగా.. ఏ చోట నువ్వున్నా పాటకు గురు రాంధ్వా సంగీతం అందించారు. అలానే హ్యాపెనింగ్ లిరిక్ రైట‌ర్ కృష్ణ కాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక‌ హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాట‌కు సింగ‌ర్స్ గా వ్య‌వ‌హరించారు.

సాహో రొమాంటిక్ యాంగిల్

ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహోలో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేదీ లోపు సాహో లో వున్న షేడ్స్ ఆఫ్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం ఇండియాలో మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతుంది.  ఈ చిత్రం ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ -విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు.

Saaho: Ye Chota Nuvvunna Song Teaser released:

Saaho Movie Second Song Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ