సినిమాలకు చంద్రబాబు ఆఫర్!

CineJosh news

నారా రోహిత్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా 'రాజా చెయ్యి వేస్తే'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. హిందీ తర్వాత ఆ స్థాయి మార్కెట్ ఉన్న భాష చిత్రం తెలుగు. సుమారుగా భారతదేశంలో సంవత్సరానికి సినిమాల మీద 10 వేలకోట్ల బిజినెస్ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాలు తీయడానికి అందమైన లోకేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు. అంతేకాకుండా తన తమ్ముడు కొడుకు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని చిత్రబృందాన్ని ఆశీర్వదించారు.

chandrababu naidu
raja cheyyi vesthe
nara rohit