బ్రహ్మానందమే హీరోగా కనిపిస్తున్నాడు!

సెకండాఫ్‌లో బ్రహ్మానందం ఎంట్రీ ఇవ్వడం.. హీరో బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకొని విలన్స్‌ను బకరా చేసి హిట్‌ కొట్టడం అనే స్కీమ్‌ని శ్రీనువైట్ల పరిచయం చేశాడు. ఆయనతో పాటు అలాంటి స్కీమ్‌లో సినిమాలు తీసిన పలువురు హిట్లు అందుకున్నారు. ఇదో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. చివరకు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ వంటి ఎందరో దర్శకులు ఈ ఫార్ములా ఫాలో ఆయ్యారు. వరస ఫ్లాప్‌లలో ఉన్న గోపీచంద్‌ సైతం ఇదే ఫార్ములాతో ‘లౌక్యం’ వంటి సూపర్‌హాట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.

దాంతో  హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న హీరో రామ్‌ తన తాజా చిత్రానికి ఇదే ఫార్ములా ఎన్నుకొన్నట్లు కనపడుతోంది. రీసెంట్‌గా రామ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘పండగచేస్కో’ ట్రైలర్‌ ఇటీవలే  విడుదలైంది. ఈ ట్రైలర్‌ చూసిన వారికి ఇందులో హీరో రామ్‌ కన్నా బ్రహ్మా నందంకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ట్రైలర్‌ కట్‌ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ ట్రైలర్‌ చూస్తే బ్రహ్కానందం హీరోగా,రామ్‌ సెకండ్‌ హీరోగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఎవరి పుణ్యాన సినిమా హిట్టయినా అది రామ్‌ కెరీర్‌కే మంచి జరుగుతుందనేది కాదనలేని సత్యం. 

brahmanandam
hero ram
pandaga chesko movie
brahmi hero