ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse's Career Is Taking a Strange Turn

భాగ్య శ్రీ బోర్సే కెరీర్ విచిత్రంగా ఉందే!

Bhagyashri Borse's Career Is Taking a Strange TurnBhagyashri Borse's Career Is Taking a Strange Turn

 

భాగ్యశ్రీ బోర్సే  కెరీర్ గ్రాఫ్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలోనే భారీ ప్రాజెక్ట్‌లతో ఎంట్రీ ఇచ్చిన  భామ ఆరంభంలో వరుస ప్లాప్‌లు .. మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నా? అవకాశాల పరంగా ఎలాంటి కొరత చూడలేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు దక్కించుకుంటూ ఎంతో వేగంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.  అయితే అఖిల్ అక్కినేని సరసన నటించిన `లెనిన్` చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో నటన, గ్లామర్‌తో పాటు కథానాయికగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకోగలిగింది.

సాధారణంగా పరిశ్రమలో ఒక  హిట్ పడితే హీరోయిన్ల డైరీ ఖాళీ లేనంతగా కొత్త అవకాశాలు క్యూ కట్టడం క‌నిపిస్తుంది. కానీ భాగ్యశ్రీ విషయంలో మాత్రం పరిస్థితి  విచిత్రంగా మారింది.  `లెనిన్` రూపంలో సాలిడ్ హిట్ ఖాతాలో పడినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆమెకు టాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్లు అనుకున్నంత స్థాయిలో రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సక్సెస్ సాధించిన తర్వాత  కెరీర్ మరింత స్పీడందుకుంటుందని భావించినా? ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒకే కాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

పాత్రల ఎంపికలో అమ్మ‌డు చూపిస్తున్న అతి జాగ్రత్త వల్లే కొత్త ప్రాజెక్ట్‌లు ఆలస్యమవుతున్నాయా లేక నిర్మాతలు వేరే ఆప్షన్ల వైపు చూస్తున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.   తెలుగులో కొత్త సినిమాలు సంతకం చేయ‌క‌పోయినా? కోలీవుడ్, మోలీవుడ్‌లలో మాత్రం ఈ భామ లైనప్ బలంగానే ఉంది. ప్రస్తుతం శివకార్తికేయన్ కాంబినేషన్‌లో తమిళంలో తెరకెక్కుతున్న `సేయన్‌` లో కథానాయికగా న‌టిస్తోంది. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రెస్టీజియస్ మూవీ `ఆపరేషన్ గంగ` లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే భాగ్యశ్రీ బోర్సే రేంజ్ మారి మళ్లీ టాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీ అవ్వడం ఖాయమని  విశ్లేషకులు భావిస్తున్నారు.   
 

What's Happening to Bhagyashri Borse's Career