ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Poor Release Planning Costs Films at the Box Office

ప్లానింగ్ లేని రిలీజ్ ఇలానే ఉంటుంది!

Poor Release Planning Costs Films at the Box OfficePoor Release Planning Costs Films at the Box Office

 

నిజమే ఒరిజినల్ వెర్షన్ అనుకోకుండా హిట్ అయ్యి.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతుంది అనగానే ఓ రెండు వారాలకు ఇతర లాంగ్వేజెస్ లో విడుదల చేస్తే ఆ చిత్రం వేరే లాంగ్వేజెస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కానీ ఈమధ్య మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న బెత్లెహెం కుటుంబ యూనిట్ ని రెండు వారాల తర్వాత తెలుగులో రిలీజ్ చేసారు. కానీ థియేటర్స్ లో ఆ చిత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది.

ఇప్పుడు మరో చిత్రము ఆ కోవలోకే వచ్చింది. హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఏకంగా రూ. 400 కోట్లు కలెక్షన్స్ తీసుకొచ్చిన హనుమాన్ అంశ్ చిత్రం.. రెండు నెలల తర్వాత తెలుగులో డబ్ అయ్యి విడుదలైంది. ఇక్కడ కూడా హనుమాన్ అంశ్ భీభత్సమైన హిట్ అవుతుంది, అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తుంది అనుకున్నారు.

క్రిటిక్స్ హనుమాన్ అంశ్ బావుంది అంటూ మంచి రేటింగ్స్ ఇచ్చినా ఆడియన్స్ మాత్రం హనుమాన్ అంశ్ ను పట్టించుకోలేదు. కారణం అసలు హనుమాన్ అంశ్ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కకపోవడము, అలాగే ఒరిజినల్ వెర్షన్ విడుదలైన రెండు నెలలకు డబ్ అవడము ఓ కారణం. బాగా లేట్ గా డబ్ చేసి విడుదల చెయ్యడమే హనుమాన్ అంశ్ తెలుగులో ఫెయిల్యూర్ కి కారణం. 
 

How Delayed Releases Affect Dubbed Movies in Telugu