ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Annapurna Studios Turns 50 With Big Ambitions

50వ వ‌సంతంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ దూకుడు!

Annapurna Studios Turns 50 With Big Ambitions

 

అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న శుభసందర్భంలో తమ తండ్రి ఏఎన్నార్ ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా ఎన్నో నేషనల్ అవార్డు చిత్రాలను నిర్మించామని నాగార్జున ఓ స‌మావేశంలో గుర్తుచేసుకున్నారు. ఈ 50 ఏళ్ల వేడుకల్లో భాగంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టి.. నాన్నగారి కాలంలో ఉన్న పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని.. నైజాంలో ఇది ఎంతో విజయవంతంగా సాగుతోందని వెల్లడించారు.

ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై మరింత వేగంగా.. భారీ స్థాయిలో సినిమాలు నిర్మిస్తూ నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు భారీగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు నాగార్జున తెలిపారు. ఇటీవల తాము `లెనిన్` చిత్రాన్ని విడుదల చేశామని.. ఇప్పుడు `పళ్ళ బురుసు`ను తీసుకొస్తున్నామని చెప్పారు. మునుముందు రంభ, ఊర్వశి, మేనక చిత్రంతో పాటు మరొక రెండు సినిమాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అలాగే తన మైలురాయి చిత్రం `కింగ్ 100` కూడా రాబోతోందని ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పూర్తి బిజీగా ఉంటూ.. మరింత ఉత్సాహంతో నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున త‌మ సొంత సంస్థ‌లో పంపిణీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఈ రంగంలో డామినేష‌న్ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. నైజాం లో ఇటీవ‌లే పంపిణీని ప్రారంభించామ‌ని కూడా నాగార్జున ఈ వేదిక‌పై వెల్ల‌డించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. తాను న‌టించే సినిమాల‌తో పాటు, ఇత‌రుల సినిమాల్లో మంచి సినిమాల‌ను రిలీజ్ చేయ‌డానికి అన్న‌పూర్ణ సంస్థ ఇటీవ‌ల ముందుకు రావ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Annapurna Studios’ 50th Year Comes With a Bang