సేఫ్ గేమ్ ఆడితే చెత్త సినిమాలే!
Saurabh Sachdeva’s Shocking Comments Go Viral
సినిమా రంగంలో ప్రయోగాత్మక పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఎప్పుడైతే పరిశ్రమలో అందరూ సురక్షితమైన దారిని (సేఫ్ గేమ్) ఎంచుకుంటారో? అప్పుడే నాణ్యత లేని చెత్త సినిమాలు తయారవుతాయని ఘాటుగా స్పందించారు. నటుడిగా ప్రతిసారీ కొత్తదనాన్ని ప్రయత్నించడమే తన లక్ష్యమని రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడనని తేల్చి చెప్పారు.
ప్రస్తుత కాలంలో కమర్షియల్ సక్సెస్ కోసం సేఫ్ రూట్ ఫాలో అవ్వాలని దర్శక-నిర్మాతలు భావిస్తుండటం వల్లనే ప్రేక్షకులకు రొటీన్ సినిమాలు చూడాల్సి వస్తోందని సౌరభ్ అభిప్రాయపడ్డారు. నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి డబ్బు .. పాపులారిటీ కంటే సవాలుతో కూడిన పాత్రలే సంతృప్తిని ఇస్తాయని తెలిపారు. ఎలాంటి భయాలు లేకుండా ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటేనే అద్భుతమైన చిత్రాలు రూపుదిద్దుకుంటాయని లేదంటే ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందన్నారు. భవిష్యత్తులోనూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతోనే ముందుకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
సౌరభ్ సచ్‌దేవా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో - సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సౌరబ్ వ్యాఖ్యలు సేఫ్ గేమ్ ఆడే నటుల విషయంలో కోపాన్ని తెప్పిస్తున్నాయి. చిన్న చిన్న నటులు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు చేసే అవకాశం రాని నటులు వచ్చిన అవకాశాలు చేయాలా? లేక ప్రయోగం పేరుతో వచ్చిన అవకాశాలు వదులుకోవాలా? అని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.







































